ఈ ఓటిటిలోకి వచ్చేసిన సిద్ధార్థ్ లేటెస్ట్ ఎమోషనల్ చిత్రం!

3BHK

తమిళ సహా తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరైన కోలీవుడ్ హీరోస్ లో టాలెంటెడ్ నటుడు సిద్ధార్థ్ కూడా ఒకరు. మరి సిద్ధార్థ్ నటించిన రీసెంట్ చిత్రమే “3 బి హెచ్ కె”. దర్శకుడు సాయి గణేష్ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా డీసెంట్ రన్ అందుకుంది. నటుడు శరత్ కుమార్, దేవయాని, చైత్ర జె ఆచార్ తదితరులు నటించిన ఈ చిత్రం ఎట్టకేలకి ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

మరి ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు నేటి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేసారు. ఇందులో నేటి నుంచి తమిళ్ సహా తెలుగులో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. మరి అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూడాలి అనుకునే వారు ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఇక ఈ సినిమాకి అమృత్ రామ్ నాథ్ సంగీతం అందించగా అరుణ్ విశ్వ నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version