టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ ది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రమే “కింగ్డమ్”. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా పట్ల మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మరికొన్ని రోజుల్లో సాలిడ్ ట్రీట్ రాబోతుంది.
అయితే ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో ఆల్రెడీ ప్రీమియర్స్ బుకింగ్స్ మొదలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ ప్రీమియర్స్ లో అప్పుడే లక్ష డాలర్స్ మార్క్ ని దాటేసి అదరగొట్టింది. దీనితో కింగ్డమ్ ట్రెండ్ గట్టిగానే ఉందని చెప్పవచ్చు. ఇక ఫైనల్ గ్రాస్ గా ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.