ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చిన ‘భైరవం’

టాలీవుడ్‌లో ఇటీవల మల్టీస్టారర్ చిత్రంగా వచ్చిన ‘భైరవం’ గురించి అందరికీ తెలిసిందే. దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ డ్రామా చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలోని కంటెంట్ మాస్ వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది.

ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 దక్కించుకుంది. దీంతో ఈ సినిమాను నేటి(జూలై 18) నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది జీ5. ఇక థియేటర్స్‌లో ఈ సినిమాను మిస్ అయినవారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయనున్నారు.

ఈ సినిమాలోని మాస్ అంశాలు ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version