టాలీవుడ్లో ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన రీసెంట్ మూవీ ‘కుబేర’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా రిలీజ్కు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది.
ఇక రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. శేఖర్ కమ్ముల మార్క్ మేకింగ్.. నాగ్, ధనుష్ల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం నేటి(జూలై 18) నుంచి స్ట్రీమింగ్కు వచ్చేసింది. పాన్ ఇండియా భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీలో చూసి ఆనందిస్తారని మేకర్స్ చెబుతున్నారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి