హీరోయిన్‌కు సారీ చెప్పిన ‘దసరా’ విలన్

న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘దసరా’. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు షైన్ టామ్ చాకో. అయితే, గతకొంత కాలంగా ఈ యాక్టర్‌పై పలు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఓ సినిమాలో హీరోయిన్‌తో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆమె ఫిర్యాదు చేసింది.

అయితే, ఈ వివాదంపై తాజాగా ఆయన స్పందించారు. మలయాళంలో తెరకెక్కుతున్న ‘సూత్రవాక్యం’లో షైన్ టామ్ చాకో, నటి విన్సీ సోనీ అలోషియస్ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో చిత్ర యూనిట్ మాట్లాడింది. ఈ సందర్భంగా షైన్ టామ్ చాకో తన వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న విన్సీకి ఓపెన్‌గా క్షమాపణలు చెబుతున్నానని అన్నాడు. ఆమెతో తాను అలా ప్రవర్తించి ఉండకూడదు అని ఆయన అన్నారు.

దీనికి విన్సీ సోనీ కూడా స్పందించింది. ఆ సమయంలో తనకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవమని.. ఆయన నుంచి అలాంటి ప్రవర్తన ఉంటుందని తాను ఊహించలేదని.. అందుకే తాను ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ సినిమా ప్రమోషన్స్‌లో వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదానికి ఫుల్ స్టాప్ పడటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version