ఓటిటిలోకి వచ్చేసిన కీర్తి సురేష్ ‘ఉప్పుకప్పురంబు’

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు అనీ ఐ వీ శశి తెరకెక్కించిన చిత్రమే ‘ఉప్పుకప్పురంబు’. ఒక కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమా రీసెంట్ గానే ట్రైలర్ తో బజ్ అందుకుంది.

అయితే ఈ సినిమాని ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఎక్స్ క్లూజివ్ గా తమ ఒరిజినల్ సినిమాల జాబితాలో ఒకటిగా అనౌన్స్ చేశారు. మరి ఎట్టకేలకి ఈ చిత్రం నేటి నుంచి ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చేసింది. సో ఈ వీకెండ్ లో థియేటర్స్ తో పాటు ఓటిటిలో మంచి ఎంటర్టైన్మెంట్ ని కోరుకునేవారికి ఇది కూడా ఒక ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి రాధికా లావు నిర్మాణం వహించగా స్వీకర్ అగస్తి సంగీతం అందించారు.

Exit mobile version