ప్రస్తుతం మన టాలీవుడ్ ఆడియెన్స్ సహా తమిళ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమానే “కుబేర”. మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల టాలెంటెడ్ హీరో ధనుష్ ఇంకా కింగ్ నాగార్జున సహా రష్మిక మందన్నా కలయికలో తెరకెక్కించిన ఈ సినిమా నుంచి అవైటెడ్ ట్రైలర్ కట్ ఎట్టకేలకి వచ్చేసింది. అయితే ఈ ట్రైలర్ మాత్రం మంచి హార్డ్ హిట్టింగ్ గా ఉందని చెప్పాలి.
శేఖర్ కమ్ముల మార్క్ నాచురల్ టేకింగ్ ఏమాత్రం మిస్ అయ్యినట్టు ఒక్క విజువల్ లో కూడా కనిపించలేదు. ముఖ్యంగా ధనుష్ పాత్రకి నాగార్జున పాత్రకి మధ్యలో ఉన్న సస్పెన్స్ కట్టిపడేసేలా ఉంది. బిచ్చగాడ్ని తీసుకొచ్చి ఎందుకు అందలం ఎక్కించారు. ఆ తర్వాత ఇద్దరి నడుమ ఏం జరిగింది అనే అంశాలు ఆసక్తిగా కనిపిస్తున్నాయి. ఇందులో రష్మిక మందన్నా పాత్రకి కూడా మంచి ప్రాముఖ్యత ఉన్నట్టుగా కనిపిస్తుంది.
ధనికులు, నిరుపేదల మధ్య వ్యత్యాసం, ఇలా ధనుష్ పాత్ర తన ప్రపంచంలోకి తీసుకెళ్లక కథ ఏమైంది అనేవి మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇక పెర్ఫామెన్స్ లు కూడా అదే రేంజ్ లో కనిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన స్కోర్ ప్రాణం పోసింది. మేకర్స్ పెట్టిన నిర్మాణ విలువలు కూడా అంతే క్లియర్ గా కనిపిస్తున్నాయి. మొత్తానికి ట్రైలర్ మాత్రం అంచనాలు అందుకుంది. ఇక జూన్ 20న వచ్చే సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే.