మన టాలీవుడ్ నుంచి వచ్చిన పలు యూత్ ఫుల్ హిట్స్ లో ఒక క్లాసిక్ అని కూడా చెప్పొచ్చు అలాంటి అతి తక్కువ సినిమాల్లో ఒక బ్యాచ్ ఆఫ్ ఫ్రెండ్స్ కి కల్ట్ క్లాసిక్ గా మారిన సినిమా “ఈ నగరానికి ఏమైంది” కూడా ఒకటి. దర్శకుడు తరుణ్ భాస్కర్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కాంబినేషన్ లో చేసిన ఈ సినిమా ఖలేజా తరహా లోనే మొదటిసారి థియేటర్స్ లో రిలీజ్ చేసినప్పుడు అంత సక్సెస్ కాలేదు కానీ రీరిలీజ్ లో మాత్రం మొదటి రిలీజ్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించింది.
అంతటి క్రేజ్ ఉన్న ఈ సినిమాకి సీక్వెల్ ని కూడా అనౌన్స్ చేశారు. దీని కోసం కూడా చాలా మంది ఎంతో ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా లేటెస్ట్ గా తరుణ్ భాస్కర్ నుంచి వచ్చిన ఓ పోస్ట్ మరింత ఎగ్జైట్మెంట్ ని నింపింది. మరి తరుణ్ ‘ది ఎండ్’ అంటూ ఒక పిక్ ని తన లాప్టాప్ పై తీసి పోస్ట్ చేసాడు. దీనితో ఇది ఈ నగరానికి ఏమైంది 2 స్క్రిప్ట్ కోసమే అని అందరికీ అర్ధం అయ్యింది. ఇక ఈ పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాపై మాత్రం ఇప్పుడు గట్టి అంచనాలే ఉన్నాయి.