మన టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు హీరోగా కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్ గా దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించిన సూపర్ హిట్ ఎంటర్టైనర్ చిత్రమే “సింగిల్”. మరి మన తెలుగులో యువతను ఎంతగానో అలరించిన ఈ ఎంటర్టైనర్ శ్రీవిష్ణు కెరీర్లో మరో సాలిడ్ వసూళ్లు అందుకున్న సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ రన్ తర్వాత ఇప్పుడు ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి సర్ప్రైజింగ్ గా వచ్చేసింది.
మరి ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా అందులో సింగిల్ సడెన్ సర్ప్రైజ్ గా స్ట్రీమింగ్ కి వచ్చేయడమే కాకుండా తెలుగు సహా పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం. సో ఈ సాలిడ్ ఎంటర్టైనర్ ని చూడాలి అనుకునేవారు డెఫినెట్ గా ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ సమర్పణలో విడుదలకి వచ్చింది.