మాస్ మహారాజ్ నెక్స్ట్.. క్రేజీ పోస్టర్ తో అప్పుడే రిలీజ్ టైం ఇచ్చేసిన మేకర్స్!

మన టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ సీనియర్ హీరోస్ లో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు. మరి తాను హీరోగా నటిస్తున్న మాస్ జాతర రిలీజ్ కి దగ్గరకి వస్తుండగా ఈ చిత్రం రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి రవితేజ సాలిడ్ ట్రీట్ ని ఇపుడు అందించారని చెప్పాలి. అయితే తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు కిషోర్ తిరుమలతో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

మరి ఈ కలయికలో సినిమాపై మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ తో పాటుగా రిలీజ్ ని కూడా అనౌన్స్ చేసేయడం అనేది విశేషం. మరి ఈ పోస్టర్ లో రవితేజ రోల్ యాటిట్యూడ్ ని గమనించవచ్చు. ఒక బిజినెస్ క్లాస్ ఫ్లైట్ లో స్పానిష్ నేర్చుకునే బుక్ ఒక చేతిలో మరి చేతిలో షాంపైన్ బాటిల్ తో కనిపిస్తున్నాడు.

దీనితో మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక ఈ పోస్టర్ తో వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసేయడం విశేషం. అంటే ఈ ఆరు నెలల్లోనే మొత్తం కంప్లీట్ చేసి విడుదల చేస్తారని చెప్పాలి. ఇక ఈ చిత్రం పూజా కార్యక్రమం కూడా నేడే మొదలు కాగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version