సాలిడ్ పోస్టర్ తో ‘ది రాజా సాబ్’ నుంచి డబుల్ బ్లాస్ట్ కి డేట్స్ వచ్చేశాయ్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న హారర్ కామెడీ థ్రిల్లర్ చిత్రం “ది రాజా సాబ్” కూడా ఒకటి. అయితే ఈ సినిమా ఎప్పుడు నుంచో తెరకెక్కిస్తుండగా ఈ పాటికే రిలీజ్ కూడా కావాల్సి ఉంది. కానీ పలు కారణాలు రీత్యా ఆలస్యం అయ్యింది. అలాగే ఆ రిలీజ్ కి ముందు కనీసం టీజర్ కూడా లేక ఫ్యాన్స్ కొంచెం డిజప్పాయింట్ కూడా అయ్యారు.

మరి ఫైనల్ గా ది రాజా సాబ్ టీజర్ సహా సినిమా బిగ్ స్క్రీన్స్ రిలీజ్ డేట్ ని కూడా ఇచ్చేసారు. మరి టీజర్ ని అనుకున్నట్టుగానే ఈ జూన్ 16న ఉదయం 10 గంటల 52 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయగా ఇక బిగ్ స్క్రీన్స్ లో రాజాసాబ్ సందడి ఈ ఏడాది డిసెంబర్ 5 నుంచి ఉంటుంది అని ప్రభాస్ పై క్రేజీ పోస్టర్ తో డబుల్ బ్లాస్ట్ అప్డేట్ ని మేకర్స్ అందించారు. మొత్తానికి మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్ కి ఇది బిగ్ న్యూస్ అని చెప్పవచ్చు.

Exit mobile version