‘అనగనగా కథ’ అంటూ ‘కుబేర’ రెండో సింగిల్ సాంగ్ రిలీజ్

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘కుబేర’ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లీడ్ రోల్స్‌లో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగా ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈ సినిమా నుంచి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వచ్చినా అభిమానులు ఫాలో అవుతున్నారు.

ఇక తాజాగా ఈ సినిమాలోని రెండో సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘అనగనగా కథ’ అంటూ సాగే ఈ సాంగ్ కుబేర చిత్ర ప్లాట్‌ను విశ్లేషిస్తోంది. ఈ సినిమా ఇతివృత్తం మనకు ఈ పాటలో కనిపిస్తుంది. ఆస్కార్ విజేత చంద్రబోస్ మరోసారి తనదైన పదాలతో ఈ పాటను రాసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ పాటను మరింత ఆసక్తికరంగా మార్చింది.

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. జూన్ 20న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version