త్వరలో మొదలుకానున్న అక్కినేని హీరో సినిమా యొక్క ఆఖరి షెడ్యూల్

Emo-Gurram-Eguravachu
సుమంత్ హీరోగా నటిస్తున్న ‘ఏమో గుర్రం ఎగరవచ్చు’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. ఇటీవలే ఈ చిత్రబృందం బ్యాంకాక్లో ఒక షెడ్యూల్ ముగించుకుని, వచ్చేవారం నుండి మరో కొత్త షెడ్యూల్ ప్రారంభించనున్నారు. ఈ నెలాఖరుకల్లా సుమంత్ ఈ సినిమా షూటింగ్ ను ముగించేసే పనిలోవున్నాడు. థాయ్ నటి అయిన పింకీ సావిక ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయంకానుంది. ఈ సినిమాకు చంద్ర సిద్ధార్ధ దర్శకుడు. మదన్ నిర్మాత. ఎస్.ఎస్ కాంచి స్క్రిప్ట్ అందించగా, ఎం.ఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. పూర్తిగా కొత్తలుక్ తో అలరించనున్న సుమంత్ ఈ సినిమా విజయంపై నమ్మకంగా వున్నాడు. ఈ చిత్రం ఈ యేడాది చివర్లో విడుదలకానుంది.

Exit mobile version