అప్పుడెప్పుడో ‘యమదొంగ’ లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన ప్రియమణికు ఆ సినిమా తరువాత నటించిన ప్రతీ సినిమా చేదు అనుభవాల్నే మిగిల్చాయి. ‘రాజ్’ సినిమాలో విపరీతంగా అందాలను ఆరబోసినా, ‘క్షేత్రం’లో జగపతి బాబుతో కలిసి నవరసాలను తెగ పండించినా లాభంలేకపోయింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘చండీ’ సినిమాపై భారీ అంచనాలే పెంచుకుంది. ప్రియమణి పుట్టినరోజు సందర్భంగా నేడు ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసారు. సముద్ర ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాతో అయినా ప్రియమణి గత వైభవాన్ని సంపాదించాలని ఆశిద్దాం