లొకేషన్ స్టిల్స్: కింగ్డమ్ సెట్స్ లో విజయ్ దేవరకొండ

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “కింగ్డమ్” కోసం అందరికీ తెలిసిందే. మరి విజయ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా ఆల్రెడీ సాలిడ్ హైప్ నెలకొంది. మరి లేటెస్ట్ గానే కొత్త డేట్ ని అందించగా మేకర్స్ సెట్స్ నుంచి పలు స్టిల్స్ కూడా వస్తున్నాయి.

ఇలా విజయ్ షేర్ చేసుకున్న పిక్ వైరల్ గా మారింది. మరి కింగ్డమ్ సెట్స్ లో దర్శకుడు గౌతమ్ తో కనిపిస్తున్న విజయ్ మంచి మ్యాచో బాడీతో డైనమిక్ గా కనిపిస్తున్నాడు. దీనితో ఈ పిక్ చూసిన ఫ్యాన్స్ మంచి ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా నాగవంశీ, త్రివిక్రమ్ లు నిర్మాణం వహిస్తుండగా ఈ జూలై 4న గ్రాండ్ గా సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version