‘వార్ 2’ టీజర్ కి ఆల్ సెట్?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ లు హీరోలుగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమే “వార్ 2”. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఒక్క రిలీజ్ డేట్ మినహా మన హీరోల ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బయటకి రాలేదు. అయితే ఇవి కాదు కానీ నేరుగా టీజర్ నే మేకర్స్ ఇపుడు దింపబోతున్నట్టుగా సాలిడ్ బజ్ ఇపుడు వినిపిస్తుంది.

దీని ప్రకారం వార్ 2 టీజర్ ని ఈ మే లోనే మేకర్స్ విడుదల చేయనున్నారట. వస్తే ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా లేదా నెలాఖరున ఈ టీజర్ ఉండొచ్చని ఇపుడు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తుండగా వారి స్పై యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ అవైటెడ్ సినిమా ఈ ఏడాది ఆగస్ట్ 14న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Exit mobile version