నటి శ్రియ నటించిన సినిమా ‘పవిత్ర’ ఈ శుక్రవారం విడుదలకానుంది. ఈ సినిమాని ఆంధ్ర ప్రదేశ్లో సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్స్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘ఇద్దరమ్మాయిలతో’ తప్ప బాక్స్ ఆఫీసు వద్ద ఏ పెద్ద సినిమా విడుదల కాకపోవడం ఈ సినిమాకి ప్లస్ అవుతుందని సినిమా నిర్వాహకులు భావిస్తున్నారు. జనార్ధన మహర్షి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఆంద్ర ప్రదేశ్ అంతట దాదాపు 500 థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాని హైదరాబాద్లో 30 థియేటర్స్ లో, నిజాంలో దాదాపు 60 నుండి 70 థియేటర్స్ లో విడుదలచేయనున్నారు. ఈ సినిమాలో శ్రియ ఒక వేశ్య గా కనిపించనుందని, తన జీవితాన్ని మార్చుకోవడానికి రాజకీయా నాయకురాలిగా మరలనుకుంటుందని సమాచారం. ఈ సినిమాని సాధాక్ కుమార్, సాయి మహేష్ రెడ్డి లు జంటగా నిర్మించారు.