చిన్న విరామం తరువాత సమంత రెట్టించిన ఉత్సాహంతో సినిమా షూటింగ్లలో పాల్గుంటుంది. వారంక్రితం పవన్ సరసన నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా ముఖ్య షెడ్యూల్ ను ముగించుకుని చిన్న హాలిడే బ్రేక్ తీసుకున్న ఈ భామ ప్రస్తుతం రీచార్జ్ అయ్యింది. “చాలా మంచి హాలిడే టైం… రెట్టించిన ప్రేమ, ఉత్సాహం, స్నేహం తో నా తదుపరి షెడ్యూల్ కు సిద్ధమయ్యా …”అని ట్వీట్ చేసింది.
ఆమె ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’, పవన్ – త్రివిక్రమ్ ల యూరోప్ షెడ్యూల్లలో పాల్గోనుంది. ఈ ఫారెన్ షెడ్యూల్ తరువాత పవన్-సమంతల సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారని సమాచారం. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.