హార్రర్ చిత్రాలకు టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ మంచి ఆదరణ చూపిస్తున్నారు. ఇక డబ్బింగ్ చిత్రాల్లో కూడా హార్రర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. అయితే, హన్సిక మోత్వానీ ప్రధాన పాత్రలో నటించిన ‘గార్డియన్’ చిత్రం తమిళనాట గత ఏడాది రిలీజ్ అయ్యింది.
ఈ సినిమాను శబరి, గురు శరవణన్ సంయుక్తంగా డైరెక్ట్ చేశారు. హార్రర్ థ్రిల్లర్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ‘గార్డియన్’ చిత్రం తెలుగులో స్ట్రీమింగ్కు వచ్చింది. ఇప్పటికే తమిళంలో ఈ మూవీ అందుబాటులో ఉంది.
దీంతో ఈ సినిమాకు తెలుగులో ఎలాంటి ఆదరణ లభిస్తుందో అనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమాలో సురేశ్ చంద్ర మీనన్, శ్రీమన్, రాజేంద్రన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.