‘పూరి’ సినిమాలో ఆ సీనియర్ బ్యూటీ ?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ల తర్వాత కొత్త సినిమా కోసం రెడీ అయ్యాడు. ఇప్పటికే, విజయ్‌ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్‌ సినిమా తెరకెక్కించన్నట్టు నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్‌ ప్రకటించింది. ఐతే, తాజాగా ఈ సినిమా కథ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ నటించనుందని తెలుస్తోంది. సీనియర్ బ్యూటీ టబు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోందని.. ఆమె పాత్ర పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తోంది.

పైగా సినిమాలో టబు పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. ఐతే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన “డబుల్ ఇస్మార్ట్” ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ ను తెచ్చుకోలేక పోయింది. ముఖ్యంగా పూరి గత సినిమాలతో పోల్చుకుంటే.. ఈ సినిమాలో బలమైన కంటెంట్ మిస్ అయ్యింది అంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో పూరి, విజయ్ సేతుపతి కోసం బలమైన కథను రాశాడట.

Exit mobile version