మాంత్రిక్స్ మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘థియేటర్లో’..నలుగురు అనేది ఉపశీర్షిక. సాయికిరణ్ ముక్కముల నిర్మాత. శ్రీనివాస్ రాజు దర్శకుడు. ధీరజ్, వరుణ్ అభిషణ్, శంకర్, శ్వేత పండిట్ నటీనటులు. ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుని జూన్ 7న విడుధలకు సిద్ధంగావుంది. ఈ సినిమా ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న థ్రిల్లర్ అని, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్రధాన బలమని దర్శకుడు తెలిపాడు.