ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ వేడుక పింక్ సిటీ జైపుర్ వేదికగా రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. భారతీయ సినీ పరిశ్రమలో విశేషంగా భావించే ఐఫా అవార్డుల వేడుక కనుల పండుగగా జరుగుతుంది. తొలిరోజు బాలీవుడ్ సినీ తారలు, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఓటీటీలో విశేష ఆదరణ సొంతం చేసుకున్న సినిమాలు, సిరీస్లకు పురస్కారాలు అందించారు.
మరి విజేతలు ఎవరో చూద్దాం రండి :
ఉత్తమ చిత్రం: అమర్ సింగ్ చంకీలా
ఉత్తమ నటుడు: విక్రాంత్ మస్సే (సెక్టార్ 36)
ఉత్తమ నటి: కృతి సనన్ (దో పత్తి)
ఉత్తమ దర్శకుడు: ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చంకీలా)
ఉత్తమ సహాయ నటుడు: దీపక్ (సెక్టార్ 36)
ఉత్తమ సహాయ నటి: అనుప్రియా గోయెంకా (బెర్లిన్)
ఉత్తమ కథ: కనికా ధిల్లాన్ (దో పత్తి)
ఉత్తమ సిరీస్: పంచాయత్ సీజన్ 3
ఉత్తమ నటుడు: జితేంద్ర కుమార్ (పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ నటి: శ్రేయాచౌదరి (బందీశ్ బందిట్స్ సీజన్ 2)
ఉత్తమ దర్శకుడు: దీపక్ కుమార్ మిశ్రా (పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ సహాయ నటుడు: ఫైజల్ మాలిక్ (పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ సహాయ నటి: సంజీదా షేక్ (హీరామండి: ది డైమండ్ బజార్)
ఉత్తమ కథ: కోటా ఫ్యాక్టరీ సీజన్ 3
ఉత్తమ రియాల్టీ సిరీస్: ఫ్యాబ్యులెస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్
ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్: యో యో హనీ సింగ్: ఫేమస్