తమిళ స్టార్ హీరో థళపతి విజయ్ నటిస్తున్న 69వ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను హీరో విజయ్ తన లాస్ట్ మూవీ గా అనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను హెచ్.వినోద్ డైరెక్ట్ చేస్తుండగా మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఈ మూవీ రాబోతుందని తెలుస్తోంది.
ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. విజయ్ 69 మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను జనవరి 26న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాతో విజయ్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ 69 మూవీలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తుండగా ప్రకాష్ రాజ్, ప్రియమణి, మమితా బైజు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్లో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’కి రీమేక్‌గా రానుందనే టాక్ వినిపిస్తోంది. మరి జనవరి 26న రానున్న విజయ్ 69 ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Update oda vandhurkom ????
69% completed ███░░#Thalapathy69FirstLookOnJan26 ????#Thalapathy @actorvijay sir #HVinoth @thedeol @prakashraaj @menongautham #Priyamani @itsNarain @hegdepooja @_mamithabaiju @anirudhofficial @Jagadishbliss @LohithNK01 @sathyaDP @ActionAnlarasu… pic.twitter.com/FA2MbAjdAY— KVN Productions (@KvnProductions) January 24, 2025