మహేష్ టైటిల్ ఏంటో తెలుసుకోవాలని వుందా??

Mahesh
సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా టైటిల్ ఏమిటనే ఉత్కంటకు తెరపడింది. ఆ సినిమా పేరు ‘1-నేనొక్కడినే’. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మొదటి పోస్టర్ రిలీజ్ చేసారు.

ఈ సినిమాను 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మహేష్ ను ఒక కొత్త స్టైలిష్ అవతారంలో కనిపిస్తున్నాడు. కృతి సనన్ హీరొయిన్. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
‘1-నేనొక్కడినే’ సినిమా భారీ బడ్జెట్ తో ఈ ఏడాది ఆఖరి నెలలలో విడుదల చెయ్యనున్నారు.

ఈ టైటిల్ ఎలా వుంది ఫ్రెండ్స్ ?? మన మహేష్ కు సరిపోతుందా? మీ యొక్క అభిప్రాయాలని క్రింది కామెంట్స్ సెక్షన్లో తెలపండి

Exit mobile version