హైదరాబాద్లో జరుగుతున్న ‘మనుసుని మాయ సేయకె’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆఖరి దశలోవుంది. ప్రిన్స్, సేతు, రిచా పనాయ్ మరియు దిషా పండే ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను తమిళంలో కుడా చిత్రీకరిస్తున్నారు. ఫుల్ హౌస్ బ్యానర్ పై విన్స్ మరియు జైసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేష్ పి కుమార్ దర్శకుడు. ఇందులో ప్రతీ క్యారెక్టర్ కొత్తగా వుంటుందని, ఇది రివేంజ్ తరహాలో సాగే ప్రేమకధ అని దర్శకుడు తెలిపాడు. ఇందులో ప్రిన్స్, దిషా పండే ఒక జంటకాగా సేతుకు జోడిగా రిచా పనాయ్(యముడికి మొగుడు హీరొయిన్) నటిస్తుంది.
మణికాంత్ సంగీతం అందిస్తున్న ఈ ఆడియో జూన్ లో విడుదలకానుంది. ఈ సినిమాను జూలై చివర్లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.