కామెడీ స్టార్ బ్రహ్మానందం పేరు ప్రతి సినిమాలలో కొత్తగా, ఫన్నీగా వుంటుందన్న విషయం మనందరికీ తెలుసు. రేపు విడుదల కానున్న’ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో కూడా బ్రహ్మానందం మ్యూజిక్ టీచర్ ఫిడేల్ బ్రహ్మ పేరుతో కనిపించానున్నాడని సమాచారం. ఈ సినిమా ట్రైలర్స్ లో బ్రహ్మానందం కనిపిస్తున్న దానిని బట్టి తను మ్యూజిక్ టీచర్ గా కనిపించనున్నాడని గెస్ చేసి చెప్పడం జరిగింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బ్రహ్మానందం గత సినిమాల కన్నా కొత్తగా కనిపించనున్నాడు. ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర చాలా ఆవేశంతో కూడినదిగా ఉండనుందా? అది తెలియాలంటే ఇంకా కొద్ది సమయం వేచి ఉండవలసిందే. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా మే 31న విడుదల చేయనున్నారు. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా కేథరిన్, అమలా పాల్ లు హీరోయిన్స్ గా నటించారు.