‘బ్రహ్మా ఆనందం’ స్పెషల్ ప్రీమియర్స్ ఫిక్స్

టాలీవుడ్‌లో ఈ వారం రిలీజ్ అవుతున్న రెండు సినిమాలు లైలా, బ్రహ్మా ఆనందం వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ఇందులో ‘లైలా’ పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమయ్యింది. అటు ‘బ్రహ్మా ఆనందం’ చిత్రంలో కూడా కామెడీ పుష్కలంగా ఉన్నప్పటికీ, ఇందులోని ఎమోషన్స్ అందరినీ ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.

ఈ సినిమాలో హాస్యబ్రహ్మ డా.బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా దర్శకుడు ఆర్‌విఎస్ నిఖిల్ రూపొందించాడు. ఈ మూవీపై ఉన్న కాన్ఫిడెన్స్‌తో మేకర్స్ స్పెషల్ ప్రీమియర్స్ వేస్తున్నట్లు తెలిపారు.

‘బ్రహ్మా ఆనందం’ చిత్ర పెయిడ్ ప్రీమియర్స్‌ను హైదరాబాద్‌లో ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే AAA సినిమాస్‌లో టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. దీంతో ఈ సినిమాను రిలీజ్ రోజు కంటే ముందే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.

Exit mobile version