స్వీట్ మెమోరీస్ పట్టుకొస్తున్న ‘నా ఆటోగ్రాఫ్’ రీ-రిలీజ్

మాస్ రాజా రవితేజ కెరీర్‌లో వెరీ స్పెషల్ మూవీగా నిలిచింది ‘నా ఆటోగ్రాఫ్ – స్వీట్ మెమరీస్’ చిత్రం. ఈ సినిమాను దర్శకుడు ఎస్.గోపాల్ రెడ్డి తెరకెక్కించగా కల్ట్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా, తమ జీవితంలో జరిగిన జ్ఞాపకాలను ప్రేక్షకులు గుర్తుకు చేసుకుంటారు. బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా, ఆ తర్వాత టీవీలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ వేరే లెవెల్.

ముఖ్యంగా ఈ సినిమాలోని లవ్ స్టోరీ, పాటలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఈ సినిమా మరోసారి ప్రేక్షకులకు తమ జీవితంలో జ్ఞాపకాలను గుర్తు చేసేందుకు రెడీ అయ్యింది. మహా శివరాత్రి కానుకగా ఈ సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఫిబ్రవరి 22న ‘నా ఆటోగ్రాఫ్’ చిత్రం రీ-రిలీజ్ కానున్నట్లు వారు పేర్కొన్నారు.

ఇక ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. గోపిక, భూమిక, మల్లిక, కనిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రీ-రిలీజ్‌లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Exit mobile version