బాలయ్య ‘అఖండ 2’ పై క్రేజీ గాసిప్

నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే, ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఐతే, ఇప్పుడు ఈ సినిమా పై మరో క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య చేస్తున్న డ్యూయెల్ రోల్ లో.. ఒక పాత్ర నెగిటివ్, మరో పాత్ర పాజిటివ్ అని తెలుస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్ లోనే బాలయ్య రెండో పాత్ర రివీల్ అవుతుందని.. సినిమా మొత్తానికే ఈ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది.

కాగా ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక పై దర్శకుడు బోయపాటి దృష్టి పెట్టారు. ఆల్ రెడీ, ఇప్పటికే పలు కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి.

Exit mobile version