ఓటిటిలో ఇక నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో “పుష్ప 2” ట్రీట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రమే “పుష్ప 2 ది రూల్”. మరి ఇండియన్ సినిమా దగ్గర రికార్డు వసూళ్లు కొల్లగొట్టి ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం రీసెంట్ గానే ఓటిటిలో కూడా వచ్చింది. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ చిత్రం ఆల్రెడీ వెస్ట్రన్ ఆడియెన్స్ లో సాలిడ్ రీచ్ ని అందుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఇపుడు వారిని మరింత అలరించేందుకు లేటెస్ట్ గా పుష్ప 2 సినిమా ఇంగ్లీష్ భాషలో కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. దీనితో ఈ చిత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రీట్ ఇవ్వనుంది అని చెప్పాలి. ఇక అక్కడ నుంచి ఎలాంటి రీచ్ ని ఈ చిత్రం అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version