ఓ ఇంటివాడైన గోపీచంద్

Gopichsnd
మాచో హీరో గోపిచంద్ ఈ రోజు ఉదయం హైదరాబాద్లో రేష్మని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి నిశ్చితార్దం డిసెంబర్లో జరిగింది. రేష్మ హీరో శ్రీకాంత్ కి బంధువు కావడం విశేషం. కొద్ది రోజుల క్రితమే సంగీత్ సెరెమని కూడా జరిగింది. ఈ వేడుకకి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు చాలా రోజుల తర్వాత గోపీచంద్ కెరీర్ మళ్ళీ ఊపందుకోనుంది. తన రాబోయే సినిమా ‘సాహసం’ కి ఫుల్ క్రేజ్ ఉంది. అలాగే ఈ చిత్ర ఫస్ట్ లుక్ కిమంచి రెస్పాన్స్ వచ్చింది. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ ఓకే నిధి కోసం వెళ్ళే ఒక ఎటిఎం వాచ్ మాన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాని మే చివర్లో గానీ, లేదా జూన్ మొదటి వారంలో కానీ రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కాకుండా దేవకట్టా దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా, బి. గోపాల్ డైరెక్షన్ లో ఓ సినిమా చెయ్యనున్నాడు.

Exit mobile version