ఎస్.ఎస్ రాజమౌళి నూతన సినిమా ‘బాహుబలి’ సినిమా మొదలుకావడానికి సర్వం సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా బృందంలోకి తమిళ నటుడు సత్యరాజ్ కూడా చేరాడట. సత్యరాజ్ ఈ సినిమాలో ఒక వైవిధ్యమున లుక్ తో ఉగ్రరూపంలో మనకు దర్శనమిస్తాడట. మిగిలిన తారల లాగే సత్యరాజ్ కూడా కటోరమైన కత్తి యుద్ధాల, గుర్రపు స్వారీల శిక్షణను పొందుతున్నాడు. ఈ మధ్యకాలంలో సత్యరాజ్ నటించిన తెలుగు సినిమాలలో ఇది రెండవది. మొదటిది ఈ ఏడాది మొదట్లో వచ్చిన కొరటాల శివ తీసిన ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ కు తండ్రిగా నటించాడు. ఆ సినిమా మంచి విజయం సాదించింది.
‘బాహుబలి’లో ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. నస్సేర్ ఒక ముఖ్య పాత్ర పోషిందాడు. మిగిలిన తారల వివరాలు తరలోనే తెలుపుతారు. ఈ చారిత్రాత్మక చిత్రంలో అన్నదమ్ములైన ప్రభాస్, రానా విరోధులుగా మారడం చూడచ్చు. ఎం.ఎం కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ సిబు శిరిల్ ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ సెట్ వేసాడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సినిమాని ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. కే రాఘవేంద్ర రావు సమర్పకుడు. ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ్, హిందీ బాషలలో తెరకెక్కనుంది.