ఇద్దరమ్మాయిలతో ప్రోమోతో ఆకట్టుకున్న దేవీ శ్రీ ప్రసాద్

Iddarammailatho11
ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ గత కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ ఫుల్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో ఏప్రిల్ 28న హైదరాబాద్లో విడుదల కానుంది. ఈ సినిమాకి సూపర్బ్ సంగీతాన్ని అందించానని దేవీ శ్రీ ప్రసాద్ చెప్పినట్టు సమాచారం. ఈ సినిమా ఆడియో ప్రోమోని ఈ రోజు విడుదల చేశారు. ఈ ప్రోమో తోనే దేవీ శ్రీ ప్రసాద్ అందరిని మనసను ఆకట్టుకున్నాడు. ఈ ప్రోమోలోని ట్యూన్ స్టైలిష్ గా, అందరిని ఆకట్టుకునేల ఉంది.  (View Promo)

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కేథరిన్, అమల పాల్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు.

Exit mobile version