ఏప్రిల్ 19న విడుదలకానున్న ‘ఎన్ఆర్ఐ’

NRI-(2)

ఏరిన్ ప్రొడక్షన్స్ పతాకం పై రోహిత్ కాలియా, శ్రావ్య రెడ్డిలు హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ‘ఎన్ఆర్ఐ’ ‘నౌ రిటర్న్ టు ఇండియా ‘అనేది ఉపశీర్షిక. ఈ సినిమాని మొదట ఏప్రిల్ 12న విడుదల చేయాలనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ 19న విడుదల చేయనున్నారు. లవ్, సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాని రఘునందన్ గూడూర్ దర్శకనిర్మాతగా పనిచేశారు. అనీష్ రాజ్ దేశ్ ముఖ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో ఆహుతి ప్రసాద్, హేమ, శివారెడ్డి, గుండు హనుమంతరావు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత, దర్శకుడు రఘునందన్ గూడూర్ మాట్లాడుతూ లవ్, సెంటిమెంట్ తో తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాదిస్తుందని ఆశాబావాన్ని వ్యక్తం చేశాడు.

Exit mobile version