చాలా కాలంగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న బ్రహ్మానందం ‘జఫ్ఫా’ సినిమా చాలా ఎట్టకేలకు విడుదల కానుంది. చాలా వరకు ఈ సినిమా షూటింగ్ గత సంవత్సరమే పూర్తి చేసారు. ఈ సినిమా మార్చి 29న విడుదల కాబోతుందని తాజా సమాచారం. బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన ఈ కామెడీ సినిమాకి వెన్నెల కిషోర్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే ఈ సినిమా కొత్త ట్రైలర్ ను విడుదల చేశారు. తను చేయని నేరానికి బలైపోయిన బ్రహ్మానందం జైలు నుంచి ఎలా తప్పించుకున్నారు అనేదే ఈ చిత్ర కథాంశం. రమేష్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా మొదటి ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తన కోట్ల మంది అభిమానులను నవ్వించడానికి బ్రహ్మానందం తొందర్లో మనముందుకు రాబోతున్నాడు.