రామ్ చరణ్ సరికొత్త సినిమా ‘తూఫాన్’ ఈ నెల 25న భారీ రీతిలో లాంచ్ కు సిద్దమయ్యింది. అపూర్వ లిఖియా దర్శకుడు. ‘జంజీర్’ గా హిందీ ప్రేక్షకులకు మొదటిసారిగా కనిపించబోతున్న చరణ్ తెలుగు వెర్షన్ పేరు ‘తుఫాన్’ అన్నది తెలిసినదే. ఇందులో రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తోంది. రామ్ చరణ్ ఇందులో యంగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ జంజీర్ కనుక హిట్ అయితే హిందీలో రామ్ చరణ్ కెరీర్ మీద చాలా ప్రభావం ఉంటుంది. అతనికి మరిన్ని అవకాశాలు వెల్లువేత్తుతాయి.
ఈ ‘తుఫాన్’ లో శ్రీహరి ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. కొన్ని వారాల క్రితమే సోనూ సూద్ గాయం కారణంగా ఆ పాత్రనుండి తప్పుకున్నాడు. విలన్ గా ప్రకాష్ రాజ్ నటించగా దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ వేసవి తరువాత విడుదలకు సిద్దమవుతుంది. తెలుగు వెర్షన్ యోగి (చింతకాయల రవి డైరెక్టర్) పర్యవేక్షణలో జరుగుతుంది. రామ్ చరణ్ మరో సినిమా ‘ఎవడు’ ఫస్ట్ లుక్ అతని పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల అవుతుంది.