‘స్వామి రా రా ‘ విజయంతో ఊపిరి పీల్చుకున్న నిఖిల్,స్వాతి

Swami-Ra-Ra
చిత్ర పరిశ్రమ చాల చిత్రమైంది . ఒక్క విజయం ఎన్నో అవకాశాలు కలిపిస్తే ఒక్క ఓటమి మాత్రం నటులు మరియు టెక్నీషియన్ ల కెరీర్ ని కోల్కొలేనంతగా దెబ్బతీస్తుంది. హీరో నిఖిల్ ,హీరోయిన్ స్వాతి తమ తమ కెరీర్ లను దిగ్విజయంగా ప్రారంభించారు కాని తర్వాత వచ్చిన ఓటమిల వల్ల అనుకున్నంతగా రాణించలేకపోయారు .
కాని ‘స్వామి రా రా ‘ ఈ యువ నటీనటులకి కావాల్సిన ఊరట నిచ్చింది . ఈ చిత్రాన్ని మల్టీప్లెక్స్లు ‘ఏ’ సెంటర్ల ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు . ఈ చిత్రం విదేశీ మార్కెట్ కూడా బాగుంది . తొలి సారి దర్శకత్వం వహించిన సుధీర్ వర్మ విమర్శకులనుంచి అదేవిధంగా సినీ అభిమానుల దగర్నుంచి ప్రశంసలు అందుకున్నాడు .

నిఖిల్ ,స్వాతి ల సెకండ్ ఇన్నింగ్స్ ఈ చిత్ర విజయం తో ఊపుఅందుకోనుందా?!!అల జరగాలనే ఆశిద్దాం. .

Exit mobile version