కొత్త కంపెనీ ప్రచారకర్తగా త్రిష ఆమోదం

Trisha-(19)
త్రిష చిత్ర సీమలోకి అడుగుపెట్టి 10ఏళ్ళు దాటింది. నటించడం రాదన్న వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ అగ్రతారగా కొనసాగింది. ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలవైపు మగ్గుచూపుతున్న తను ఇప్పుడు ఎం.ఎస్ రాజు ‘రమ్'(రంభ ఊర్వశి మేనక) అనే మహిళా ప్రాధాన్య చిత్రంలో నికిషా పటేల్, ఇషా చావ్లా మరియు చార్మీ తో పాటు ప్రధాన పాత్రధారురాలిగా నటిస్తుంది.

తాజా వార్త ఏమిటంటే ఇండియా మార్కెట్లోకి వచ్చే యేడు ప్రవేశించానున్న ఒక ప్రముఖ ఐస్ క్రీం కంపెనీకి తను ప్రచార కర్తగా వ్యవహరించడానికి అంగీకరించిందట. “నాకు చాలా ఇష్టమైన ఐస్ క్రీం కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించడానికి చాలా ఆనందంగా ఉంది. ఇది ఇండియాలో త్వరలో ప్రారంభం కానుంది. నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అప్పటివరకూ ష్ ష్ ష్ ష్ ష్…..” అని ట్వీట్ చేసింది. వినికిడి ప్రకారం ఆ కంపెనీ పేరు బెన్ & జెర్రీ అట. అధికారికంగా ప్రకటన ఇంకా చేయాల్సివుంది. ఇప్పటి వరకూ త్రిష ఫాంటా, ఫెయ్రెవెర్, వివేల్ మొదలగు బ్రాండ్స్ కి ప్రాచారకర్తగా వహించింది.

Exit mobile version