నితిన్ నూతన చిత్రం ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఆడియో వినూత్న రీతిలో ఇప్పుడే హైదరాబాద్లో లాంచ్ అయ్యింది. ఏ. కరుణాకరన్, నందినీ రెడ్డి, సురేందర్ రెడ్డి, కోన వెంకట్, బండ్ల గణేష్, దిల్ రాజు, జ్వాలా గుత్తా మరియు హర్షవర్ధన్ రాణే మరియు కొంతమంది చిత్ర బృందం ఈ వేడుకకి హాజరయ్యారు. విజయ్ కుమార్ ఈ సినిమాకి దర్శకుడు. నిఖితా రెడ్డి నిర్మాణంలో విక్రమ్ గౌడ్ సమర్పిస్తున్నారు. ముఖ్య తారాగణం జ్వాలా గుత్తా నటించిన ‘డింగ్… డింగ్… డింగ్’ పాట ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. ఐ. ఆండ్రూ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమా ఏప్రిల్ 19న మనముందుకు రానుంది