సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతోంది. కొద్దిరోజులకు ముందే మేము ఈ సినిమా లండన్ లో షూటింగ్ జరుపుకోనుంది అని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్న ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. అది లండన్ వీదుల్లో ఒక అద్భతమైన చేజ్ సెక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. ఈ చేజ్ కు కావాల్సిన లోకేషన్స్ ను ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఈ చేజ్ సన్నివేశాలు ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని సమాచారం.
భారీ బడ్జెట్ తో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతి సనొన్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ గా తెరకెక్కనుందని, దీనిలో మహేష్ బాబు కొత్తగా కనిపించనున్నాడని సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమాకు ఎటువంటి పేరు పెట్టలేదు. ఈ సినిమా ఈ సంవత్సరం సెకండాఫ్ లో విడుదలయ్యే అవకాశం ఉంది