అల్లు శిరీష్ తాజా చిత్రం ‘గౌరవం’ ఫస్ట్ లుక్ మరియు టిజర్ నటుడిగా అల్లు అర్జున్ 10వ సంవత్సరాన్ని పురస్కరించుకున్న ఈరోజు విడుదల చేసారు . ఇప్పటివరకు కేవలం తమిళ్ లో మాత్రమే ప్రసారం చేసిన ట్రైలర్ ని అల్లు శిరీష్ ,ప్రకాష్ రాజ్ కలిసి అధికారికంగా తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేసారు . చిత్రం గురించి మాట్లాడతూ “మనకి మన కులం తో మతం తో అనుభంధం వుండొచ్చు కాని ఆ అనుబంధం మానవత్వానికి చేటు చేయ్యనంతవరకే మంచిది. ఇదే మా ‘గౌరవం’ అంతర్లీనంగా వుండే నేపధ్యం. ఈ చిత్రం సినిమా హానర్ కిల్లింగ్స్ నేపధ్యంలో ఉంటుందని అని వినికిడి . రాధ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ కి జంటగా ఏమి గౌతం నటిస్తుంది. థమన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో కేవలం రెండు పాటలు మాత్రమే వున్నాయని సమాచారం . ప్రీత సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రం ఏప్రిల్ లో రిలీజ్ కానుంది .
టీసర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి