సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఎన్ హెచ్ 4′ సినిమా సమ్మర్ తర్వాత విడుదలకు సిద్దమవుతోంది. అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ వెట్రిమారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మనిమారన్ డైరెక్టర్. ఈ చిత్ర తెలుగు – తమిళ ఆడియో విడుదల కార్యక్రమం ఒక ఫేమస్ రేడియో స్టేషన్లో ఏప్రిల్ 1న జగనుంది. ఎన్ హెచ్ 4 తెలుగు వెర్షన్లో సిద్దార్థ్ ఓ పాట పాడారు. ‘మనిమారన్, వెట్రిమారన్ కలిసి రియాలిటీకి దగ్గరగా ఉండే ఎన్ హెచ్ 4 అనే యాక్షన్ థ్రిల్లర్ ని రూపొందిస్తున్నారు. నా తొలి యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇదే’ అని సిద్దార్థ్ ట్వీట్ చేసారు. ఆశ్రిత శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలోని ఎక్కువ భాగాన్ని చెన్నై – బెంగుళూరు హైవే లో చిత్రీకరించారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ ని లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ వారు ఆంధ్రప్రదేశ్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.