ఆది, నిషా అగర్వాల్, భావన రుపరెల్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సుకుమారుడు’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్లో జరగనుంది. ‘పిల్ల జమిందార్’ ఫేం జి. అశోక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని శ్రీ సౌదామిని క్రియేషన్స్ బ్యానర్ పై కె. వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ, ఊర్వశి శారద కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ పై వచ్చే ఓ పాటని ఇటీవలే హైదరాబాద్ లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. సమ్మర్ చివర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.