పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో మిస్టర్ పర్ఫెక్ట్, అతను సినిమా అన్ని విషయాల్లోనూ చాలా కేర్ తీసుకుంటారు అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకి ‘సరదా’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలో వేసిన ఓ రిసార్ట్ సెట్లో జరుగుతోంది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం తెలిపిన సమాచారం ప్రకారం మొదట ఈ సెట్ చూసిన పవన్ అనుకున్న కాన్సెప్ట్ కి సెట్ అయ్యేలాగా లేదని, అలాగే కలర్ ఫుల్ గా లేదని షూటింగ్ రద్దు చేసి తెరపై రిచ్ లుక్ తో గ్రాండ్ గా ఉండేలా సెట్లో మార్పులు చేయమని చెప్పారట.
రెండవ సారి పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ సూపర్ హిట్ అవ్వాలని ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ప్రణిత నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ, నదియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత.