నాటీ బోయ్స్ గా హిందీ ‘ఢిల్లీ బెల్లి’ రిమేక్

Arya

తమిళ హీరో ఆర్య నటిస్తున్న సినిమా ‘ నాటీ బోయ్స్’ త్వరలో మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో హన్సిక, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హిందీలో హిట్ ను సాదించిన ‘ఢిల్లీ బెల్లి’ సినిమాని తెలుగులో ‘నాటీ బోయ్స్’ గా, తమిళంలో ‘సెట్టయ్’ గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో సంతానం, నాజర్, ఆలీ, షియాజీ షిండేలు నటిస్తున్నారు. ఎస్. రోన్నీ స్కూవాలా, సిద్దార్థ్ రాయ్ కపూర్ లు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్.థమన్ సంగీతాన్నిఅందిస్తున్నాడు. ఆర్. కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలకు సిద్దమవుతోంది.

Exit mobile version