ఆ సినిమా పేరు సర్వేజనా సుఖినోభవంతు

venkatesh-ram-photos

అగ్ర హీరోల సినిమా మొదలైన దగ్గరనుండి ఆ సినిమా టైటిల్ గురించి అనేక చర్చలు జరుగుతాయి. అలంటి చర్చలలో ఒకటే విక్టరీ వెంకటేష్ మరియు రామ్ కలిసి నటిస్తున్న కొత్త చిత్రం. ఇది హిందీలో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్ కలిసి నటించిన ‘బోల్ బచ్చన్’ సినిమాకి రీమేక్. మార్చి 13న మొదలైన ఈ సినిమాకి ‘సర్వేజనా సుఖినోభవంతు’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం. ప్లీజ్ స్మైల్ అనేది ట్యాగ్ లైన్.

ఈ సినిమాకి కే. విజయ భాస్కర్ దర్సకత్వం వహిస్తున్నాడు. వెంకటేష్ తో అతనికి ఇది మూడవ సినిమా. ఇప్పటికే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో నటించి మల్టీ స్టారర్ సినిమాల రుచిని మరోసారి చూపించిన వెంకీ ‘షాడో’ సినిమా తరువాత మళ్ళి అలంటి ప్రయోగం చెయ్యడం నిజంగా ప్రసంశనీయం. మిగిలిన తారల వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

Exit mobile version