బాద్షా కోసం త్యాగం చేస్తున్న హరీష్ శంకర్

ntr-harish-shankar

గబ్బర్ సింగ్ ఇచ్చిన ఊపుతో హరీష్ శంకర్ నాలుగో సినిమా ఎన్టీఆర్ హీరోగా రూపొందిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ శ్రీను వైట్ల డైరెక్షన్లో తెరకెక్కుతున్న బాద్షా చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నాడు. బాద్షా షూటింగ్ చివరి దశకు చేరుకున్న సమయంలో హరీష్ శంకర్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించారు. హరీష్ శంకర్ తను రూపొందిస్తున్న సినిమా అనౌన్స్ చేయాలని అనుకున్నాడు.అయితే బాద్షా చివరి దశలో ఉండటం త్వరలో ఆ సినిమా విడుదల కాబోతుండటంతో తన సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తే కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుందని. బాద్షా పూర్తయి విడుదలైన తరువాత తన సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేయాలనీ హరీష్ నిర్ణయించుకున్నాడు. తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బండ్ల గణేష్ బాద్షాకి నిర్మాత కావడం, వారి మధ్య స్నేహం కోసం హరీష్ శంకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అనిపిస్తోంది.

Exit mobile version