కడల్ దెబ్బకు కన్నీరు పెడుతున్న తమిళనాడు డిస్టిబ్యూటర్స్

mani-ratnam

ఈ మద్య విడుదలైన మణిరత్నం సినిమా కడల్ తమిళనాడులో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమా బారీ అంచనాల మద్య ఫిబ్రవరి 1న విడుదలైంది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద చెప్పుకోదగిన కలక్షన్లను సాదించలేకపోయింది. తమిళనాడులో ఈ సినిమా వల్ల డిస్టిబ్యుటర్లు చాలా పెద్దమొత్తంలో నష్టపోయారు. స్పష్టంగా చెప్పాలంటే 50 మంది వరకు తమిళనాడు డిస్టిబ్యుటర్లు మణిరత్నం ఆఫీసు వద్దకు వెళ్లి నష్టపరిహారం ఇవ్వలని కోరినట్టు, అందులో ఒక డిస్టిబ్యుటర్ 70%వరకు నష్టపోయానని చెప్పారాని సమాచారం..మణిరత్నం మొదట్లో తీసిన “ఇరువర్” సినిమాకు నష్టపో యిన డిస్టిబ్యుటర్స్ కు నష్టపరిహారం ఇచ్చాడని.ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడో అని అందరు అనుకుంటున్నారు. ఈ సినిమా కు ఎ అర్ రహమాన్ సంగీతాన్ని అందించగా, గౌతం కార్తీక్, తులసి, అరవింద్ స్వామి మరియు అర్జున్ లు నటించారు.

Exit mobile version