ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న బాహుబలి ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రభాస్, రానా అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ సినిమా వారి మధ్య వైరాన్ని చూపిస్తూ ఈ సినిమాని రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రస్తుతం బరువు పెరిగే పనిలో పడ్డాడు. యాక్షన్ అడ్వెంచరస్ గా రూపొందనున్న ఈ సినిమా కోసం సరికొత్త లొకేషన్లలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి బృందం ఈ లొకేషన్ వేటలో పడ్డారు. వచ్చే మూడు రోజుల్లో కర్ణాటక, కేరళలోని లొకేషన్ల వేట కొనసాగించనున్నారు. ఈ సినిమాకి బాహుబలి అనే వర్కింగ్ టైటిల్ పెట్టడంతో గోమటేశ్వరుడి కథనే ఈ సినిమాకి మూల కథగా వాడుకుంటారు అంటూ వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు.