
లీడర్ సినిమా ద్వారా పరిచయమైన రిచా గంగోపాధ్యాయ అడపా దడపా తెలుగు సినిమాల్లో నటిస్తుంది కానీ ఎక్కువగా సెకండ్ హీరోయిన్ లాంటి పాత్రలే చేస్తుంది. ఇదే విషయాన్ని ఆమెని అడగగా తను సెకండ్ హీరోయిన్ పాత్రలు ఏమి ఎంచుకోవట్లేదని, దర్శకులు తన దగ్గరికి వచ్చి నా పాత్ర గురించి చెప్పినపుడు ఆ పాత్రకి ఎంత ప్రాధాన్యం ఉంది అనేది మాత్రమే చూసుకుంటాను. అంతే కానీ సెకండ్ హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్ అనేవి చూడను. ఇలా ఫస్ట్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ అని చూడటం నాకు నచ్చదు. రిచా నటించిన మిర్చి ఈ రోజే విడుదల కాగా నాగార్జున సరసన నటిస్తున్న భాయ్ షూటింగ్ దశలో ఉంది.